యుపిఐ పేమెంట్ డిక్లైన్స్ ను ఎలా తగ్గించుకోవాలి
యుపిఐ పేమెంట్ డిక్లైన్స్ను తగ్గించుకోవడానికి, లావాదేవీ జరుపుతున్నప్పుడు క్రింది తెలియపరచబడిన నిర్దేశాలను అనుసరించండి
- యుపిఐ విదానంలో డబ్బులు చెల్లిస్తున్నప్పుడు మీ ఖాతాలో తగినన్ని డబ్బులు ఉన్నాయని నిశ్చయించుకోవాలి
- లావాదేవీ జరిపేటప్పుడు చెల్లే యుపిఐ పిన్‌ను ఎంటర్ చేసినట్లుగా నిర్ధారించుకోవాలి
- యుపిఐ లావాదేవీలపై ఏర్పరుచుకున్న పరిమితుల ప్రకారం లావాదేవీ చేయాలి
- డబ్బును అందుకునే వారి ఖాతా బ్లాక్ / ఫ్రోజెన్ చేయబడలేదని నిర్ధారించుకోవాలి
- రిజిష్టరు చేసుకున్న తరువాత మొదటి 24 గంటలసమయంలో రూ.5,000 (క్యుములేటివ్) కంటే ఎక్కువ మొత్తాన్ని లావాదేవీ చేయవద్దు
- తప్పు యుపిఐ పిన్ ను 3 సార్లు ఎంటర్ చేయవద్దు, అలా చేయడం కన్నా క్రింది ఇవ్వబడిన నిర్దేశాలను ఉపయోగించి పిన్ను రీసెట్ చేసుకోవాలి
- ఖాతా విభాగంలో రీసెట్ యుపిఐ పిన్ పైన క్లిక్ చేయాలి
- ఖాతా యొక్క డెబిట్ కార్డ్ యొక్క చివరి 6 అంకెలను ఎంటర్ చేయాలి
- ఖాతా డెబిట్ కార్డ్ ముగిసే తేదీని ఎంటర్ చేయాలి
- బ్యాంకు నుండి అందుకున్న ఒటిపిని ఎంటర్ చేయాలి
- కొత్త యుపిఐ పిన్‌ను కన్‌ఫర్మ్ చేయాలి
- యుపిఐ పిన్ రీసెట్ కన్‌ఫర్మేషన్‌ను మీరు అందుకుంటారు