సెక్యురిటీ ప్రశ్నలతో ఒక అదనపు లెవల్
లో సంరక్షణని జత చెయ్యండి
సెక్యురిటీ (భద్రత గురించిన) ప్రశ్నలేమిటి?
సెక్యురిటీ ప్రశ్నలనేవి ఒక సెక్యురిటీ ఫీచర్ (విశేషత), ఇది అదనపు లెవల్ లో ప్రొటెక్షన్ ని అందజేస్తుంది. మీరు మీకు నచ్చిన ఏ మూడు ప్రశ్నలకైనా జవాబు చెప్పవచ్చు. ఇప్పుడు మీరిచిన్న జవాబులు రికార్డు చెయ్యబడి, అవి పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా మరియు భద్రంగా ఉంచబడతాయి. నేపథ్యంలో మా సెక్యురిటీ ఇంజన్ పనిచేస్తూ, మిమ్మల్ని సంరక్షిస్తుంది మరియు మీ సాధారణ ఆన్లైన్ బ్యాంకింగ్ యూసేజ్ ప్రవర్తనలో ఏదైనా తేడా కనబడితేనే (అప్పుడు మాత్రమే) అది మిమ్మల్ని ఒక ప్రశ్నతో ప్రాంప్ట్ చేస్తుంది. ప్రాంప్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు జవాబు చెప్పినట్లే, ఖచ్చితంగా అలాగే, మీరు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి.
మీ సాధారణ ప్రవర్తన నుండి ఏదైనా తేడాని మా సెక్యురిటీ ఇంజన్ గమనిస్తే, మీ జవాబులు మీ గుర్తింపుని నిర్ధారణ చేసేందుకు మాత్రమే వాడబడతాయని దయచేసి గమనించండి.
సెక్యురిటీ ప్రశ్నలను నేను సెటింగ్ చేస్తున్నప్పుడు నేను మనస్సులో ఉంచుకోవలసినది ఏమిటి?
మీ వ్యక్తిగత జవాబులతో సెటప్ చేస్తున్న ఈ మూడు ప్రశ్నలు మీ ఐడెంటిటీ (గుర్తింపుని) వెరిఫై చెయ్యడంలో మాకు తోడ్పడతాయి. ఈ ప్రశ్నలను సెట్ చేస్తున్నప్పుడు, మీరు ఈక్రింది విషయాలు మనసులో ఉంచుకోవాలి.
- ఇది మీకు వ్యక్తిగతమై ఉండాలి
- మీరు గుర్తుపెట్టుకునేందుకు సులువుగా ఉండాలి కానీ ఇతరులు ఊహించేందుకు కష్టంగా ఉండాలి.
- సోషల్ మీడియాలోని మీ ‘పబ్లిక్’ ప్రొఫైల్ నుండి ఉండకూడదు.
- దీనిని ఎవరికీ వెల్లడి చెయ్యకూడదు
ఒక అధీకృతుడైన బ్యాంకు ఉద్యోగి వీటిని ఎన్నడూ అడగరని గుర్తుంచుకోండి.
ఈ ప్రశ్నలు నన్ను ఎప్పుడు అడుగుతారు?
నేపథ్యంలో మా సెక్యురిటీ ఇంజన్ పనిచేస్తూ, మీకు విస్తరింపబడిన భద్రతను కలిగిస్తుంది. మా సిస్టం మీ సాధారణ ఆన్లైన్ బ్యాంకింగ్ యూసేజ్ ప్రవర్తనలో ఏదైనా తేడా కనబడితేనే (అప్పుడు మాత్రమే) అది మిమ్మల్ని ఒక ప్రశ్నతో ప్రాంప్ట్ చేస్తుంది.
మీరొక ట్రాన్సాక్షన్ ని పూర్తి చేస్తున్నప్పుడో లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ లో లాగిన్ చేస్తున్నప్పుడో, మీరు ప్రాంప్ట్ చెయ్యబడతారు. ఈ ప్రాంప్ట్ ఆన్ లైన్ బ్యాంకింగ్ లో మీ ఐడెంటిటీని వెరిఫై చేసేందుకు.
ఈ సెక్యురిటీ (భద్రతని) ఎలా మెరుగు అవుతుంది?
సెక్యురిటీ ప్రశ్నలనేవి ఒక సెక్యురిటీ ఫీచర్ (విశేషత), ఇది అదనపు లెవల్ లో ప్రొటెక్షన్ ని అందజేస్తుంది. ఈ ప్రశ్నలు మరియు జవాబులు మీకు వ్యక్తిగతమైనవి మరియు మీ ఐడెంటిటీని వెరిఫై చేసేందుకు మాకు తోడ్పడతాయి. సెక్యురిటీ ప్రశ్నలతో పాటు మరికొన్ని భద్రతా చర్యలు తీసుకోబడతాయి, ఇవి ఇండస్ ఇండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని మరింత సురక్షితంగా చేస్తాయి, వీటిలో ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టం, ఎన్ క్రిప్షన్, ఫైర్ వాల్స్ మరియు ఆటోమేటిక్ టైమ్- ఔట్స్ ఉంటాయి.
ఉదాహరణలు
ఇక్కడ అందజేయబడిన జవాబులు సూచనాప్రాయం మాత్రమే. ఈ ఖచ్చితమైన జవాబులను దయచేసి వాడకండి.
- మీ వెకేషన్ ఇల్లు ఏ నగరంలో ఉంది?
నైనితాల్ (మీ సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి తెలిసిన జవాబు ఉండకూడదు) - మీ మొదటి పెట్ (పెంపుడు జంతువు) పేరు ఏమిటి?
రూస్టర్ (జవాబు మీకు వ్యక్తిగతమై ఉండాలి) - మీరు పనిచేసిన మీ మొదటి కంపెనీ ఏమిటి?
ABC లిమిటెడ్ (ఇది అనుమతించబడదు, ఎందుకంటే, ఈ జవాబు సులువుగా సోషల్ ఫోరమ్స్ లో లభ్యమౌతోంది) - మీ మారుపేరు ఏమిటి?
AAA లేదా PQR (ఇది అనుమతించబడదు, ఎందుకంటే, అవే అక్షరాలు పదేపదే రాయడం అనుమతించబడదు)