మీ కార్డు సమాచారాన్ని
పరిరక్షించేందుకు చిట్కాలు
- లావాదేవీలు ఎలర్ట్ లు, చిరునామా/మొబైల్ నంబరు మార్పులు లాంటి, బ్యాంకు పంపే ఎలర్ట్ ల పట్ల దృష్టిపెట్టండి మరియు ఒకవేళ తేడాలు ఉంటే బ్యాంకుకు తెలియజేయండి.
- బ్యాంకుకు ఇచ్చిన చిరునామా లేదా మొబైల్ నంబరు మార్పులు ఉంటే వెంటనే బ్యాంకుకు తెలియజేయండి.
- మీ వ్యక్తిగత గుర్తింపు నంబరును (పిన్) జ్ఞాపకం చేసుకోండి, దాన్ని క్రమం తప్పకుండా మార్చండి, పిన్ నెంబరుకు సంబంధించిన బౌతిక డాక్యుమెంట్లు వేటినైనా ధ్వంసం చేయండి.
- లావాదేవీ తరువాత మర్చంట్ అవుట్ లెట్ లో మీకు తిరిగిచ్చిన క్రెడిట్/డెబిట్ కార్డు మీదనే విషయం నిర్థారించుకోండి.
- మర్చంట్ అవుట్ లెట్ లో, మీ సమక్షంలో మీ క్రెడిట్/డెబిట్ కార్డును స్వైప్ చేయవలసిందిగా నొక్కిచెప్పండి.
- మర్చంట్ అవుట్ లెట్ లో, మీ సమక్షంలో మీ క్రెడిట్/డెబిట్ కార్డు పైన స్వైప్ చేయవలసిందిగా నొక్కిచెప్పండి.
- మెుత్తాన్నినిర్థారించుకునేందుకు, లావాదేవీ తరువాత లావాదేవీ నోటిఫికేషన్ మెసేజ్ ను పరీక్షించండి.
- పిఒఎ మిషన్లు మరియు ఎటిఎంల్లో నమోదు చేసేటప్పుడు, క్రెడిట్/డెబిట్ కార్డు పిన్ ఇతరులకు కనిపించడంలేదని నిర్థారించుకోండి.
- మీక్రెడిట్/డెబిట్ కార్డు పోతే లేదా మీ వివరాలను పొరబాటున ఎవరికైనా ఇస్తే వెంటనే బ్యాంకును సంప్రదించండి.
- బ్యాంక్ కస్టమర్ కేర్ నంబరును చేతిలోఉంచుకోండి, దీనివల్ల సహాయం అవసరమవ్వడం / అత్యవసరం / కార్డు పోగొట్టుకొనుట / వివాదాస్పద లావాదేవీలు లాంటి కేసుల్లో మీరు వెంటనే కాల్ చేసుకోవచ్చు.
- నకిలీ మెసేజ్ లు / కాల్స్ / ఇ మెయిల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు మీ వివరాలతో ఇలాంటి కమ్యూనికేషన్ దేనికీ ఎప్పుడూ స్పందించకండి.
- సురక్షితంకాని వైఫైనెట్ వర్క్ ను ఉపయోగించి మీకార్డుకు/అకౌంటుకు యాక్సెస్ పొందకండి లేదా బహిరంగ స్థలాల్లో ఇలాంటి నెట్ వర్కుల పై ఆన్ లైన్లో షాపింగ్ చేయకండి
- ఎటిఎంలో అపరిచితుల నుంచి సహాయం కోరకండి, వాళ్ళు స్వచ్ఛందంగా సహాయపడినా కూడా.
- మీ క్రెడిట్ / డెబిట్ కార్డును ఎప్పుడూ ఎవ్వరికీ అందజేయకండి, "తాము ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రతినిధిమని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ.
- మీ పిన్ / ఒటిపి / సివివి / విబివి / మాస్టర్ సెక్యూర్ పాస్ వర్డును ఎవ్వరికీ వెల్లడించకండి.బ్యాంకు లేదా ఏదైనా ఇతరప్రభుత్వ సంస్థ ఈ సమాచారం కోరదు.